Header Banner

తిరుమల రద్దీకి టీటీడీ కొత్త చర్యలు.. ఆ టోకెన్లపై కీలక నిర్ణయాలు! భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా..!

  Mon Apr 21, 2025 11:09        Devotional

తిరుమలలో శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల రద్దీ క్రమేణా పెరుగుతోంది. వేసవి సెల వుల వేళ ప్రతీ ఏటా భక్తుల రద్దీ పెరగటం సాధారణం. రద్దీకి అనుగుణంగా టీటీడీ ముందస్తు చర్య లు చేపట్టంది. ఇదే సమయంలో భక్తులకు కీలక సూచనలు చేస్తోంది. బ్రేక్ దర్శన లేఖలను ఈ రద్దీ ముగిసే వరకూ నిలుపుదల చేసే ఆలోచనలో టీటీడీ ఉంది. కాగా, దివ్య దర్శనం టోకెన్ల విషయం పైన టీటీడీ ఫోకస్ చేసింది. దీంతో, శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తులు రద్దే వేళ తమ సూచనలు పాటించాలని టీటీడీ కోరుతోంది.

నిర్దేశిత సమయంలోనే
తిరుమలలో శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచన చేసింది. ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే రావాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. ఆయ‌న స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు. టీబీసీ, ఏటీసీ వ‌ద్ద క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు చేసిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు.క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అన్నప్ర‌సాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్ ను ఆయ‌న ప‌రిశీలించి భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా అన్న ప్ర‌సాదాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భ‌క్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు.

ప్రత్యేక చర్యలు
క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం నూత‌నంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తు లకు నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. స‌ర్వ ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా స‌మ‌న్వ‌యంతో ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నామ‌ని వివరించారు. ఇదే సమయంలో శ్రీవారి దర్శనం అలిపిరి మార్గంలో కాలి నడకన తిరుమలకు వస్తున్న వారికి గతంలో ఉన్న ప్రయోజనాలను పునరిద్దరించాలని డిమాండ్ పెరుగుతోంది. వేసవి లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో..రెండ నడక మార్గాల్లో వచ్చే వారి కోసం దివ్య దర్వనం టోకెన్లు ఇవ్వటంతో పాటుగా కోటా పెంచాలని కోరుతున్నారు. కరోనా సమయంలో ఈ టోకెన్ల జారీ నిలిపివేసారు. ఆ తరువాత చిరుత దాడితో తిరిగి టోకెన్లు తిరిగి ప్రారంభించలేదు.

దివ్య దర్శనం టోకెన్లు
అలిపిరి నడక పమార్తంలో నిత్యం దాదాపు 8 వేల నుంచి 15 వేల మంది భక్తులు నడిచి వస్తు న్నారు. గతంలో అలిపిరి నడక మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల చొప్పున నిత్యం 20 వేల దివ్య దర్శన టోకెన్లు ఇచ్చేవారు. వైకుంఠం క్యూలైన్లలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా తరువాత దివ్య దర్శనం భక్తులకు ప్రాధాన్యత ఉండేది. ఉచిత లడ్డూ ప్రసాదం అందించే వారు. కొంత కాలం క్రితం గతంలో తరహాలోనే టోకెన్ల జారీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందు కోసం గాలిగోపురం వద్ద స్కానింగ్ కేంద్రం ఏర్పాటు చేసారు. తరువాత ఆ ప్రతిపాదన పక్కన పెట్టే సింది. దీంతో, దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు మెట్టు మార్గం వరకు వెళ్లాల్సి వస్తోంది. అదీ రోజుకు మూడు వేల టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. దీంతో.. ప్రస్తుత రద్దీ వేళ గతంలో లాగానే రెం డు మార్గాల్లోనూ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయాలనే డిమాండ్ పైన టీటీడీ కసరత్తు చేస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TirumalaRush #TTDUpdates #DivyaDarshan #TirumalaDevotees #TTDDecisions #TokenUpdate